Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుహాసినీగారిని అదే మాట అడిగాను: ఆశ్రిత వేముగంటి

  • 'యాత్ర'లో మంచి పాత్ర చేశాను 
  • సుహాసినిగారితో కలిసి నటించడం అదృష్టం
  • ఆమె చాలా డీసెంట్ అని చెప్పిన ఆశ్రిత
తాజా ఇంటర్వ్యూలో ఆశ్రిత వేముగంటి మాట్లాడుతూ, తాను 'యాత్ర' సినిమా చేసినప్పటి విషయాలను గురించి ప్రస్తావించారు. 'యాత్ర' సినిమాలో సుహాసిని గారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. సుహాసినిగారు చాలా డీసెంట్ గా కనిపిస్తారు. సెట్లో అందరిని నవ్వుతూ పలకరిస్తారు. గతంలో తను హీరోయిన్ గా చేసిన సినిమాల గురించి ఎవరైనా అడిగితే, ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఆమె ఆ విషయాలను చెప్పేవారు. ఆ తరువాత ఆమె తనకి నచ్చిన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవారు.

నేను ఆమె దగ్గరికి వెళ్లి 'ఇంతకాలంగా సినిమాలు చేస్తూ ఇంత క్రేజ్ ను సంపాదించుకున్నారు గదా, అయినా ఇంత సింపుల్ గా మీ జర్నీని ఎలా కొనసాగిస్తూ వస్తున్నారు?' అని అడిగాను. అందుకు ఆమె స్పందిస్తూ .. "నేను ఎప్పుడూ కూడా క్రేజ్ ను తలకెత్తుకోను .. ప్రతి పాత్రను ఒక పాఠంగా భావించి, ఒక విద్యార్థిలా అర్థం చేసుకుంటూ వెళతాను. అనుభవాలే అణకువను నేర్పాయి" అని ఆమె చెప్పుకొచ్చారంటూ ఆశ్రిత వేముగంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
Ashrita Vemuganti

More Telugu News